![]() |
![]() |

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్, సీనియర్ నిర్మాత కె. మహేంద్ర మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్ మరణించారు.
కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ ల వివాహం 2003 లో జరిగింది. మనస్పర్థల కారణంగా 2016 వీరు విడాకులు తీసుకున్నారు. 53 ఏళ్ళ సంజయ్.. ఇంగ్లాండ్ లో నివాసముంటున్నారు. నిన్న రాత్రి అక్కడ గ్రౌండ్ లో పోలో మ్యాచ్ ఆడుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయారు. మ్యాచ్ సమయంలో గుర్రంపై స్వారీ చేస్తుండగా ఓ తేనెటీగ సంజయ్ నోట్లోకి వెళ్ళిపోయిందని.. దాంతో ఇబ్బందిపడిపడిన ఆయన సడెన్ గా కుప్పకూలారని సమాచారం.
నిన్న అహ్మదాబాద్ విమానం కూలిన ఘటనలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ.. సంజయ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. సంజయ్ కపూర్ మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖలు, నెటిజెన్లు సంతాపం తెలుపుతున్నారు.

![]() |
![]() |